యోగాతో సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత

– హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
ప్రతి ఒక్కరి జీవితంలో యోగ ఒక భాగం కావాలని, యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పొందవచ్చని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్టపై సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే సతీష్ కుమార్ విద్యార్థులు, మహిళలతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యోగాను పరిచయం చేసింది మన భారత దేశమేనని, మనందరం సగర్వంగా, మన దేశ వారసత్వ సంపదను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ప్రతి సంవత్సరం యోగ దినోత్సవాన్ని జరుపుకుందామని అన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్మన్ ఐలేని అనిత, కౌన్సిలర్లు బోజు రమాదేవి రవీందర్, పేరుక భాగ్యరెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love