శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం ప‌ట్టివేత‌

నవతెలంగాణ – హైద‌రాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం ప‌ట్టుబ‌డింది. దుబాయ్ నుంచి ఓ ప్ర‌యాణికుడి వ‌ద్ద 1,761 గ్రాముల బంగారాన్ని క‌స్ట‌మ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 1.10 కోట్లు ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేశారు. దుబాయ్ నుంచి అక్ర‌మంగా బంగారం త‌ర‌లించిన నిందితుడిని కేర‌ళ‌కు చెందిన వ్య‌క్తిగా క‌స్ట‌మ్స్ అధికారులు గుర్తించారు. నిందితుడిని శంషాబాద్ పోలీసుల‌కు అప్ప‌గించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

 

Spread the love