670 మందికి వైద్య పరీక్షలు, మందులు పంపిణీ
విజయవంతమైన వైద్య శిబిరం
నవతెలంగాణ-తలకొండపల్లి
గ్రామాల్లో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను ప్రజలు ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తెలిపారు. గురువారం మండల పరిధిలోని వెల్జాల్ గ్రామపంచాయతీ అవరణలో సర్పంచ్ సంగీత శ్రీనివాస్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపును నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంపునకు జడ్చర్ల అమోఘ హాస్పిటల్ స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు పాల్గొన్నారు. ఈ క్యాంపును స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. సుమారుగా 670 మందికి వైద్యులు నిర్వహించారు. వారికి కావాల్సిన మందులను ఎమ్మెల్యే, సర్పంచ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలు ఇబ్బందులు పడకుండా ఇటువంటి క్యాంపులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇటువంటి క్యాంపులు నిర్వహించేందుకు ముందుకు వచ్చిన ప్రజాప్రతినిధులును ఎమ్మెల్యే ఈ సందర్భంగా అభినందించారు. రాష్ట్రంలో నలుమూలల ప్రజలకు అందుబాటులో ఉండేందుకు సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వం ఆస్పత్రులను కోట్ల రూపాయాలతో నిర్మిస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో సీఎం రిలీఫ్ ఫండ్‌ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు సిఎల్ శ్రీనివాస్ యాదవ్, ఆమనగల్ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, బిఆర్‌ఎస్ మండలాధ్యక్షులు కుమ్మరి శంకర్, విజరు కుమార్ రెడ్డి, ఎంపీటీసీ సుధాకర్ రెడ్డి, సర్పంచులు చంద్రయ్య, ధరణి శివశంకర్ రెడ్డి, హైమావతి రమేష్, జయమ్మ వెంకటయ్య, రాములు,మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ సుమంత్ కుమార్, డాక్టర్ దీప్తి, డాక్టర్ వరప్రసాద్, బిఆర్‌ఎస్ నాయకులు మల్లేష్, శ్రీశైలం, యాదయ్య, శంకర్, నరోత్తన్ రెడ్డి, కుమార్ గౌడ్, చంద్రయ్య ,సత్యం గౌడ్,మాజీ సర్పంచ్ బాలకృష్ణయ్య, మనెమ్మ, యాదయ్య, విజరు, శ్రీరామ్, జంగయ్య, పెంటయ్యగౌడ్, రైతు సమితి గ్రామ అధ్యక్షులు నరేందర్ గౌడ్, మోహన్‌లాల్, లక్ష్మీనారాయణ గౌడ్, చంద్రయ్య, రాజు గుప్తా, రాములు, శ్రీకాంత్ యాదవ్, శేఖర్, బంధులాల్, శ్రీరామ్, రాములు, అశోక్, విజరు, సుధాకర్, యాదగిరి, శేఖర్, రవి, చెన్నకేశవులు, శ్రీశైలం, సాయి అమోఘ ఆస్పత్రి వైద్య సిబ్బంది ప్రవీణ్, కురుమయ్య, సువర్ణ, శివలీల, సుజాత, వివిధ గ్రామాల ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.