‘చలో హైదరాబాద్‌’ సభను విజయవంతం చేయాలి

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ
నవతెలంగాణ-శంకర్‌పల్లి
జులై మూడో వారంలో ‘చలో హైదరాబాద్‌’ సభను విజయవంతం చేసేందుకు ప్రతీ ఇంటి నుంచి మాదిగ బిడ్డలు తరలిరావాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పిలుపనిచ్చారు. బుధవారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని మన మణి గార్డెన్‌ లో చేవెళ్ల నియోజకవర్గంలో నిర్వహించిన ఎమ్మా ర్పీఎస్‌ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన హాజరై, మాట్లాడుతూ జులై నెలలో నిర్వహించే చలో హైదరాబాద్‌ సభను విజయవంతం చేయాలనీ, ఈ సభ ద్వారా రాష్ట్రానికి, కేంద్రానికి దిమ్మ తిరిగే విధంగా ఉండాలన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ , కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలూ పూర్తిగా విఫలమైనట్టు తెలి పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చేస్తా నని చెప్పి దళితులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఎస్సీ వర్గాకరణ చేపట్టకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు పెంచిన ఘనత ఎమ్మార్పీఎస్‌కు దక్కుతుందన్నారు. అలాగే అనాథ పిల్లల సంరక్షణ చూసుకుంటానని చెప్పి, అనాథలను మో సం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మా ర్పీఎస్‌ చేవెళ్ల నియోజకవర్గ నాయకులు ప్రవీణ్‌ కుమార్‌ మాదిగ, రంగారెడ్డి జిల్లా కన్వీనర్‌ నరసింహ, కో కన్వీనర్‌ కృష్ణ, ఎంఎస్పీ రంగారెడ్డి జిల్లా కన్వీనర్‌ బాబు, శంకర్పల్లి మండల ప్రధాన కార్యదర్శి శివ శంకర్‌,ఎమ్మెస్పి నాయకులు వంశీ,మనోజ్‌, శ్రీకాంత్‌, సీనియర్‌ నాయకులు లక్ష్మయ్య, పెంటయ్య,రాంచందర్‌, శ్రీనివాస్‌, జనార్ధన్‌, గణేష్‌, సతీష్‌ చేవెళ్ల నియోజవర్గ నాయకులు తదితరలు పాల్గొన్నారు.

Spread the love