ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి

గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి
జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్‌ కలెక్టరేట్‌
ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి, గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని వికారా బాద్‌ జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. శుక్రవా రం కలెక్టరేట్‌లోని ఛాంబర్‌లో జిల్లా నుండి అంతర్జాతీ య ప్రమాణీకరణ సంస్థ (ఐఎస్‌ఓ 9001:2015) వికారాబాద్‌ జిల్లా నుండి నాలుగు ఉత్తమ గ్రామాలను గుర్తించి, అవార్డులను ప్రకటించింది. ఆయా గ్రామాల సర్పంచులు, అధికారులకు కలెక్టర్‌ అవార్డులను ప్రదా నం చేసి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలోని గ్రామాల సర్పం చులు, అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయడం మంచి శుభ పరిణామన్నారు. భవిష్యత్తులో ఇదే వొరవడితో కష్టపడి పనిచేసి ముందుకు సాగాలని ఆయన కోరారు. మోమి న్‌పెట్‌ మండలానికి చెందిన సర్పంచ్‌ ఎన్‌.నరసిం హారెడ్డి చీమలదరి, నవాబ్‌పేట్‌ మండలానికి చెందిన ఎల్లకొండ సర్పంచ్‌ రావుగారి వెంకటరెడ్డి, వికారాబాద్‌ మండలం పులమద్ది సర్పంచ్‌ టీ.మాధవరెడ్డి, తాండూ ర్‌ మండలం కరణ్‌కోట్‌ సర్పంచ్‌ వీణా హేమంత్‌.. వీరికి నాణ్యత నిర్వాహణలో జాతీయస్థాయి అవార్డు రావడం అభినందనీయమని అన్నారు. జిల్లాలోని పీరం పల్లి, ద్యాచారం, పులుమద్ది, గోధుమగూడ, గొట్టిము క్కుల, నారాయణపూర్‌, పెళ్లిమడుగు గ్రామాల్లో తయారుచేసిన శ్రీ అనంతపద్మనాభ వర్మీ కంపోస్ట్‌ ఎరు వుల నమూనాల బ్యాగులను కలెక్టర్‌ సమక్షంలో ప్రద ర్శించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్లు సచిత్‌ గంగ్వార్‌, నారాయణ అమిత్‌, డీపీఓ తరుణ్‌కు మార్‌, జానకిరెడ్డి, డీఆర్డీఓ కృష్ణన్‌, డిప్యూటీ సీఈవో సుభాషిని, వికారాబాద్‌, తాండూర్‌ డీఎల్‌పీఓలు అనిత, శంకర్‌నాయక్‌, ఎంపీడీవో సత్తయ్య, సంబంధిత గ్రామా ల సర్పంచులు, కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love