ఎమ్మెల్యే ఆరోగ్యంగా ఉండాలని పూజలు

– ఎంపీపీ టీ బాలేశ్వర్‌ గుప్తా, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు రవీందర్‌ రెడ్డి
– మండల వ్యాప్తంగా పూజలు నిర్వహించిన, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు
నవతెలంగాణ-యాలాల
కారులో కర్ణాటకు ప్రయాణిస్తున్న తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి శనివారం రోడ్డు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. తాండూరు ప్రజా సేవ కునిపై అభిమానంతో తాండూరు నియో జకవర్గం వ్యాప్తం గా దేవాలయాలు, మసీదులు, చర్చిలలో, స్వచ్ఛందంగా ప్రజానీకం ప్రత్యేక పూజలు చేశారు. యాలాల మండలం ఎంపీపీ తాళ్లపల్లి బాలేశ్వర్‌ గుప్తా మండల కేంద్రంలోని ఆంజనే యస్వామి దేవాలయంలో స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి నిండు నూరేళ్లు ఆయు రారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేయిం చారు. అదేవిధంగా యాలాల మండల బీఆర్‌ఎస్‌ అ ధ్యక్షులు సి. రవీందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో జుంటిపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయంలో 101 కొబ్బరి కాయలు కొట్టించి ప్రత్యేక పూజలు గావించారు. ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి కారు ప్రమాదం నుంచి క్షేమం గా బయటపడ్డ సందర్భంగా ఆయన పేరు మీద అర్చన, అభిషేకం, చే యించారని రవీందర్‌ రెడ్డి తెలిపారు. యాలాల మండల వ్యాప్తంగా గ్రామ గ్రామానా ఆలయాల్లో బీఆర్‌ఎస్‌ నాయ కులు, కార్యకర్తలు, అభిమా నులు, పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు.

Spread the love