పొదుపుతోనే సభ్యుల ప్రగతి సాధ్యం

సత్య సాయి పొదుపు సంఘం అధ్యక్షులు పగిడిమర్రి సూర్యనారాయణ
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
పొదుపుతోనే ప్రగతి సాధ్యమని సత్యసాయి పొదుపు సంఘం అధ్యక్షులు పగిడిమర్రి సూర్యనారాయణ అన్నారు. ఆదివారం మైలార్‌దేవ్పల్లి డివిజన్‌ పరిధిలోని మార్కండేయనగర్‌లో సత్యసాయి పొదుపు సంఘం 23వ వార్షిక మహాసభ సంఘ ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు సూర్య నారాయణ మాట్లాడుతూ మార్కండేయనగర్‌లో 23 సంవత్సరాల క్రితం 20 మంది సభ్యులతో ఈ సం ఘం ఏర్పడిందన్నారు. మార్చ్‌ 31వ తేదీ 2023 నాటికి రూ. 3.64 కోట్ల టర్నవర్‌ 800 మంది సభ్యులతో అభి వృద్ధి పథంలో ముందుకు సాగుతుందని తెలిపారు. సంఘం సభ్యులకు 12 శాతం వడ్డీతో సభ్యులకు వారి పొదుపులను అనుసరించి రూ.5 నుంచి రూ.10 లక్షల రుణ సౌకర్యం కల్పిస్తుందని చెప్పారు. బ్యాంకులతో పో ల్చితే సంఘం ద్వారా సభ్యులు రుణాలు సరళంగా పొందగలుగుతున్నారని అన్నారు. సంఘం అభివృద్ధికి స భ్యులు సకాలంలో పొందిన రుణాల కిస్తిలను చెల్లించాలని సూచించారు. రుణం తీసుకోవడం సంఘం నిబంధనల మేరకు నెలవారీ పొదుపు, అప్పు కిస్తి, వడ్డీ చెల్లించడం ద్వారా సంఘం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం వ్యవస్థపాకులు గద్దె యాదగిరి, సలహాదదులు ఏర్వ సత్యనారాయణ, గద్దె క్రిష్ణ, పగిడిమర్రి వాసు, ఉపాధ్యక్షులు మునగపాణి విష్ణు, ప్రధానకార్యదర్శి కోట శ్యామ్‌కుమార్‌, సహాయ కారదర్శి కర్నాటి శ్రీనివాస్‌, కోకాధికారి సినికె భాస్కర్‌, పాలకవర్గ సభ్యులు కంది అశోక్‌, కైరంకొండ శంకర్‌, విడెం రమేష్‌, శిరందాస్‌ నరేందర్‌, కోట పవన్‌, బి.విజరుకుమార్‌, గంజి నరేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love