బొంపల్లిలో రోడ్డు ప్రమాదం ఒకరికి తీవ్రగాయాలు

నవతెలంగాణ-దోమ
మండల పరిధిలోని బొంపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బొంపల్లి గ్రామానికి చెందిన యాదయ్య(58) నడుచుకుంటూ వెళ్తున్నాడు. కుల్కచర్ల మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తి తన బైక్‌పై వేగంగా వస్తూ యాదయ్యను ఢకొీట్టాడు. ఈ ప్రమాదంలో యాదయ్యకు ఒక కాలు విరగగా, తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్‌లో క్షతగాత్రున్ని పరిగి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ విశ్వజన్‌ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు.
మానవత్వం చాటుకున్న టీఆర్‌ఆర్‌
డీసీసీ అధ్యక్షులు పరిగి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ టి.రామ్మోహన్‌ రెడ్డి తన వాహనంలో కుల్కచర్ల నుండి పరిగి వెళుతున్నాడు. ఇదే క్రమంలో మండల పరిధిలోని బొంపల్లి లో యాదయ్య రోడ్డు పక్కన తీవ్రంగా గాయపడి రక్తమోడుతు ఉండడం చూశాడు. తన వాహనంలోని కిట్‌ ద్వారా వారికి ప్రథమ చికిత్స అందించి, వెంటనే పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించి ఖర్చుల నిమిత్తం రూ. 6,500 ఆర్థికసాయం అందించారు. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రి యాజమాన్యం తో మాట్లాడి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి పరిగి మున్సిపల్‌ కౌన్సిలర్‌ షబ్బేనూర్‌ రియాజ్‌ అంబులెన్స్‌లో హైదరాబాద్‌ పంపించారు.

Spread the love