బ్రెజిల్‌లో వర్ష బీభత్సం.. 37మంది మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : బ్రెజిల్‌లోని దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే దో సుల్‌లో భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య శుక్రవారం రాత్రికి 37కి పెరిగింది.. ఇంకా 74 మంది అదృశ్యమయ్యారు. ఇది చరిత్రలోనే అత్యంత దారుణమైన విపత్తుగా అధికారులు పేర్కొంటున్నారు. బ్రెజిల్‌లోని దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే దో సుల్ భారీ వర్షాలు, కొండచరియల విధ్వంసకర ప్రభావాలతో పోరాడుతోంది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. కూలిన ఇళ్లు, వంతెనలు, రోడ్ల శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని గుర్తించేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు గవర్నర్ ఎడ్వర్డో లైట్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. చరిత్రలోనే అత్యంత దారుణమైన విపత్తును ఎదుర్కొంటున్నామని అన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని గవర్నర్ విచారం వ్యక్తం చేశారు.

Spread the love