‘దిఎలైట్‌ హౌటల్‌’ను ప్రారంభించిన

హీరోయిన్‌ నిధి అగర్వాల్‌
నవతెలంగాణ-చందానగర్‌
గచ్చిబౌలి రోడ్డులోని ఓల్డ్‌ హఫీజ్‌పేట్‌లో ఆదివారం ప్రముఖ హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ ‘ది ఎలైట్‌ హౌటల్‌’ను ప్రారంభించారు. ఆ ప్రారంభోత్సవంలో బి.శ్రీనివాస్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, టి.జగదీశ్వర్‌రెడ్డి, వి. విష్ణువర్ధన్‌రెడ్డిలు నిర్వహిస్తున్నారు. ఈ హౌటల్‌ ప్రారంభోత్సవానికి మంచి ర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు,ప్రముఖ దర్శకులు సంపత్‌ నంది, విరూపాక్ష దర్శకులు కార్తిక్‌ దండు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనం తరం నిధి అగర్వాల్‌ మాట్లాడుతూ. దిఎలైట్‌ హౌటల్‌ ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. హౌటల్‌ అధినేతలు బి.శ్రీనివాస్‌రెడ్డి, రామకష్ణారెడ్డి, టి. జగదీశ్వర్‌ రెడ్డి, వి. విష్ణు వర్ధన్‌రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపారు. హౌటల్‌ అధినేతలు మాట్లాడుతూ ది ఎలైట్‌ హౌటల్‌ ప్రారంభోత్సవానికి హాజరైన అతిథులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కొంత మంది ఫ్రెండ్స్‌ కలిసి, మంచి విజన్‌తో ఈ హౌటల్‌ ప్రారంభించామని తెలిపారు. రానున్న ఐదేండ్లలో వివిధ ప్రాంతాల్లో మరో పదిహేను హౌట ల్స్‌ ప్రారంభించాలనే ఆలోచన ఉందన్నారు.పులావ్‌ పట్నం పేరుతో ఎన్నో డెలిషియస్‌ వెరైటీస్‌ అందిస్తున్నామని తెలిపారు. ఏ కార్పొరేట్‌ గెస్ట్‌ హైదరా బాద్‌ వచ్చినా, వారికి అన్ని విధాల సౌకర్యాలు తమ హౌటల్‌ ఉంటుందన్నారు.

Spread the love