ఘనంగా మాజీ ఎమ్మేల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి జన్మదిన వేడుకలు

నవతెలంగాణ-షాద్‌ నగర్‌
షాద్‌నగర్‌ నియోజక వర్గ బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మేల్యే చౌలపల్లి ప్రతాప్‌ రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు కార్యకర్తల మధ్య ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం పట్టణంలో కుంట్ల రాంరెడ్డి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలు కోలాహలంగా జరిగాయి. ముందుగా అంబెడ్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన కేక్‌ కట్‌ చేసి అభిమానులకు బీఆర్‌ఎస్‌ నేతలకు కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, యువజన సంఘాల నేతలు, వివిధ పార్టీల నాయకులు ప్రతాప్‌ రెడ్డికి శాలువాలు,బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలకు సదా రుణపడి ఉంటానని, ప్రజాక్షేత్రంలో తనను ఎంతో అభిమానించి ఆదరించిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని అన్నారు. పదవిలో ఉన్న లేకున్నా మీరు చూపిన ప్రజాభిమానం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివద్ధి సంక్షేమానికి పాటుపడుతుందని గతంలో ఎన్నడు లేని విధంగా పల్లెలు పట్టణాలు అభివద్ధి పథంలో పరుగులెడుతూ దేశంలోనే రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపి దేశానికే ఆదర్శనేతగా కేసీఆర్‌ ఉన్నారని కొనియాడారు. భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో బిఆర్‌ఎస్‌ ప్రభంజనం తద్యమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఫరూఖ్‌ నగర్‌ జడ్పీటిసి పీ. వెంకట్రామిరెడ్డి, కొత్తూరు మాజీ ఎంపీపీ శివశంకర్‌ గౌడ్‌, రెడ్డి సేవా సమితి నాయకులు గుర్రం రవీందర్‌ రెడ్డి, మదన్‌ మోహన్‌ రెడ్డి, సీపీఐ నాయకుడు శ్రీను నాయక్‌, ఎంఆర్‌పీఎస్‌ నాయకులు పెంటనోల్ల నర్సింహ మాదిగ, మాజీ జడ్పీటిసి నర్సింగ్‌ రావు, కష్ణ మహేశ్‌ ప్రజాసేన అధ్యక్షుడు ఎండి ఖాదర్‌ గోరి,యువసత్త లక్ష్మణ్‌, జాంగారి రవి, రాయికల్‌ మోహన్‌ రెడ్డి,రామేశ్వరం సర్పంచ్‌ సంపత్‌, శంకర్‌ రెడ్డి, సుదర్శన్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.
విజయవంతమైన రక్తదాన శిబిరం
మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని అభిమానులు ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో యువకులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 మందికి పైగా యువకులు నాయకులు రక్తదానం చేశారు.

Spread the love