కార్పొరేటర్‌ చొరవతో కదిలిన ట్రాన్స్‌కో అధికారులు కాలనీల్లో తీరిన విద్యుత్‌ కష్టాలు

కార్పొరేటర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు
నవతెలంగాణ-గండిపేట్‌
కొత్తగా ఏర్పడిన కాలనీకి వెలుగు కాంతుల కావాలని ప్రజల ఆరాటం ఫలించింది. కొన్నేండ్ల నుంచి కార్పొరేట ర్‌కు, విద్యుత్‌ అధికారులకు తమ గోడు విన్నవించారు. ఇప్పటికైనా అధికారుల్లో చలనం వచ్చింది. శుక్రవారం కార్పొరేటర్‌ తలారి చంద్రశేఖర్‌ చొరవతో ట్రాన్స్‌కో అధికా రులు కదిలారు. బండ్లగూడ కార్పొరేషన్‌ గంధంగూడ మొ దటి వార్డు విద్యనగర్‌ కాలనీలో విద్యుత్‌ స్తంభాలతోపాటు లో వోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు విద్యుత్‌ అధికారులు ముందుకొచ్చారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ తలారి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. విద్యనగర్‌ కాలనీ సమస్యల కోసం కౌన్సిల్‌ సమావేశంలో అనేక సార్లు చర్చించినట్టు తెలిపారు. ఇక్కడ అందరూ పేదలేనని తెలిపారు. కాలనీ సమస్యలను ఎమ్మెల్యే, ఎంపీ, మేయర్‌, డిప్యూటీ మేయర్‌, కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపా రు. వారి చొరవతో విద్యనగర్‌ కాలనీకి 24 గంటలపాటు విద్యుత్‌ వచ్చే విధంగా చర్యలు తీసుకున్నట్టు తెలిపా రు. తమ సమస్యను పరిష్కరించిన కార్పొరేటర్‌కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్సింగి మార్కె ట్‌ కమిటీ డైరెక్టర్‌ కాట సాయిబాబ, నాయకులు బత్తుల నరేందర్‌, దస్తయ్య, కాలనీవాసులు, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love