రాచకాలువపై నూతన వంతెన వేయాలి

ఉప్పరిగూడ సర్పంచ్‌ బూడిద రాంరెడ్డి
ఎమ్మెల్యే కిషన్‌రెడ్డిని కలిసి వినతి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఇబ్రహీంపట్నం చెరువు కట్ట నుంచి ఉప్పరిగూడ వరకు చేపడుతున్న రోడ్డు నిర్మాణం సందర్భంగా రాచకాలువపై నూతన వంతెనను వేయాలని ఉప్పరిగూడ సర్పంచ్‌ బూడిద రాంరెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని కోరారు. వంతెన వద్ద ధాన్యం లోడుతో వస్తున్న లారీ అదుపు తప్పి కాలువలో పడిపోయింది. విషయం తెలుసుకున్న సర్పంచ్‌ బూడిద రాంరెడ్డి ఘటనా స్థలాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఉప్పరిగూడ గ్రామం మీదుగా రోడ్డు నిర్మాణం చేస్తుండగా రాచకాలువపై అదుపుతప్పి ఓవర్‌ లోడ్‌తో వస్తున్న ధాన్యం లారీ కాలువలో పడిపోయిన విషయాన్ని వివరించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పంచాయతీరాజ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌తో ఫోన్లో మాట్లాడి వెంటనే ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించి వంతెన నిర్మించడానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. అదే విధంగా రోడ్డు నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

Spread the love