తాండూర్‌ మున్సిపల్‌లో లోపించిన పారిశుధ్యం

– వార్డుల్లో తొలిగించని చెత్త శుభ్రం చేయని మురుగు కాలువలు
– వార్డుల్లో పారిశుధ్యంపై చొరవ చూపని మున్సిపల్‌ అధికారులు
– మున్సిపల్‌లో ఆస్తవ్యస్తంగా మారిన శానిటేషన్‌
– పట్టించుకోని ఉన్నతాధికారులు చెత్తతో కంపుగొడుతున్న పట్టణం
నవతెలంగాణ-తాండూరు
తాండూరు మున్సిపల్‌లో శానిటేషన్‌ విభాగం అస్తవ్య స్తంగా మారింది. మున్సిపల్‌లో ఏ వార్డులో చూసినా చెత్త కుప్పలు దర్శనం ఇస్తున్నాయి. అసలే వానాకాలం ప్రారంభ మైంది. పారిశుధ్యం లోపించడంతో ప్రజలు ఇబ్బందులు ప డి రాగాల పాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. తాండూరు పట్టణ ప్రజలు అసలే రోడ్లు, వాయు కాలుష్యంతో ఇబ్బం దులు పడుతుంటే దానికి సరిపోదంటూ మళ్లీ మీదికేని శానిటేషన్‌ ఇబ్బందులు ప్రజలను అనేక వ్యాధుల బారిన పడేస్తున్నాయి. మున్సిపల్‌ పరిధిలోని అన్ని వార్డుల్లో శానిటే షన్‌ సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. చెత్తను ఎత్తేయడంలో శానిటేషన్‌ విభాగం పూర్తిగా విఫలమైంది. తాండూరులో రోజు వార్డుల్లో పూర్తి స్థాయిలో తొలగించడం లేదు. మున్సిపల్‌లో శానిటేషన్‌పై పర్యావేక్షణ లేకపోవడం కారణంగానే సంబంధిత అధికారులు ఇష్టారా జ్యంగా వ్యవహారిస్తున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్‌లో శానిటేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ చూ పాల్సిన అధికారులు, చూసీ చూడనట్లు వ్యవహారించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిందని ఉన్నతాధికారుల, నాయకుల దృష్టికి తీసుకొస్తున్న యధావిధిగానే శానిటేషన్‌ సమస్య నెలకొంటుందని అధికార పార్టీ కౌన్సిలర్లు ఆందోళ న వ్యక్తం చేస్తున్నారు. గతంలో మున్సిపల్‌లో ట్రైసైకిళ్లు, ట్రాక్టర్లు, ఆటోలు పోని ప్రదేశాలకు గల్లీలకు ట్రైసైకిళతో చెత్తసేకరణ జరుగుతుందన్నారు. కానీ మాటలు అమలు కావడం లేదు. పట్టణంలో శానిటేషన్‌ మెరుగు పడేందుకు గతంలో రూ.13లక్షల40 వేలతో ట్రైసైకిళ్లు, తోపుడు బం డ్లు కొనుగోలు చేసి శానిటేషన్‌ సమస్య పరిష్కారిస్తమన్నా రు. కానీ సమస్య పరిష్కారం కావడం లేదు. ఇచ్చిన ట్రైసైకి ళ్లు కూడా మూలన పడ్డాయి. పట్టణంలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకపోతుంది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొక తప్పడం లేదు. పట్టణంలో పారిశుధ్య కార్మికులు చెత్తను ఎత్తేయడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పట్టణంలో శానిటేషన్‌ సమస్యను బాగు చేయాలని పట్టణంలో శానిటే షన్‌ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

Spread the love