నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉంటా

డీసీసీబీ చైర్మన్‌ బుయ్యని మనోహర్‌ రెడ్డి
నవతెలంగాణ-పరిగి
పరిగి నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని డీసీసీబీ చైర్మన్‌ బుయ్యని మనోహర్‌ రెడ్డి అన్నారు. బుధవారం పరిగి పట్టణ కేంద్రంలోని మైత్రి వెంచర్‌లో నూతన గృహ నిర్మాణానికి డీసీసీబీ చైర్మన్‌ బుయ్యని మనోహర్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటూ, ప్రజలకు సేవ చేసేందుకు ముందు ఉంటాన న్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ మరింత చేరువ య్యేందుకే ఈ నూతన గృహ నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సర్పంచ్‌ల సంఘం అ ధ్యక్షుడు అశోక్‌ రెడ్డి, గండీడ్‌ పిఎసిఎస్‌ చైర్మన్‌ కమతం శ్రీనివాస్‌ రెడ్డి, చౌడపూర్‌ మండల బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సుధాకర్‌ రెడ్డి, పిఎసిఎస్‌ వైస్‌ చైర్మన్‌ నాగరాజు, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌ యా దయ్య గౌడ్‌, పరిగి మాజీ జెడ్పీ టీసీ బాబయ్య, వెంకట్‌ రాంరెడ్డి, మాదారం మాజీ సర్పంచ్‌ వెం కటేష్‌, షోహెబ్‌, భాస్కర్‌ రెడ్డి, గంగాధర్‌ గౌడ్‌, మొగులయ్య, రాంలాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love