కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ నాయకులు

నవతెలంగాణ-మర్పల్లి
మండలంలోని భూచన్పల్లి గ్రామపంచాయతీ అనుబంధ గ్రామం జాజిగుబ్బడి తండా నుంచి 20 మంది బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు మండలాధ్యక్షుడు యు రవీందర్‌, గ్రామ కమిటీ అధ్యక్షులు బి వెంకట్రాంరెడ్డి ల ఆధ్వర్యంలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ నాయకత్వంలో ఆదివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో దేశంలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ,వర్గాలతో పాటు అన్ని వర్గాలను ఆదుకునేది కాంగ్రెస్‌ పార్టీయే అన్నారు. రాష్ట్రంలో బిజెపి, టీఆర్‌ఎస్‌ పార్టీలు ఒకటేనని ప్రజలు గుర్తించినందునే కాంగ్రెస్‌ పార్టీలో పెద్ద ఎత్తున కలుస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల రూపాయల పంట రుణాలు మాఫీ, నిరుద్యోగ భృతి, 18 సంవత్సరాల పైబడి చదువుకున్న విద్యార్థులందరికీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌, 500 కే గ్యాస్‌ లాంటి ఎన్నో పథకాల అమలు అవుతాయని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్‌ పార్టీని ఆదరించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భూచన్పల్లి మాజీ సర్పంచ్‌ రోభ్యానాయక్‌, మాజీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కే శ్రీనివాసరెడ్డి, నాయకులు బలవంత రెడ్డి, ఎల్‌ ప్రభాకర్‌ రెడ్డి, బిచ్చిరెడ్డి, భక్కారెడ్డి, మర్పల్లి గ్రామానికి చెందిన సీనియర్‌ నాయకులు గూడెం మల్లేష్‌ యాదవ్‌, రెడ్డినాయక్‌, తదితరులు పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారిలో మెగావత్‌ సుభాష్‌, నాయక్‌ మెగావత్‌, మాన్సింగ్‌, దేవిదాస్‌, మెగావత్‌ అనిల్‌, మెగావత్‌ గురునాథ్‌ ప్రసాద్‌, కిషన్‌ బాలు, అరవింద్‌, కిషన్‌, రాందేవ్‌ వీర్‌ల ఆధ్వర్యంలో సుమారుగా 30 మంది కాంగ్రెస్‌లో చేరినట్టు తెలిపారు.

Spread the love