– నిందితులు స్మగ్లింగ్ పాల్పడుతున్నారని అధికారులు
– అంచనా విలువ రూ.1 కోటి 37 లక్షలు
– ముగ్గురు ప్రయాణికుల అరెస్టు
– లక్ష రూపాయల విలువైన విదేశీ సిగరెట్లు స్వాధీనం
నవతెలంగాణ-శంషాబాద్
వేరువేరు దేశాల నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ ముగ్గురు ప్రయాణికులు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళ వారం పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి హైదరాబాద్ హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు ఒక కోటి 37 లక్షల విలువైన 2.279 కిలోల బంగారాన్ని పట్టుకు న్నారు. ఈ మూడు వేరు వేరు కేసుల్లో బంగారం పట్టుబడింది. ఒక ప్రయాణికుడు రూ. 72 లక్షల విలువైన 1196 గ్రాముల బంగారాన్ని ఎయి ర్‌క్రాఫ్ట్‌లో పేస్ట్ రూపంలో దాచుకొని ఎయిర్ పోర్టుకు వచ్చాడు. మరో వ్యక్తి రాస్ అల్ ఖైమా మంచి శంషా బాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. తనిఖీ చేసిన అధికా రులు రూ.45 లక్షల విలువ చేసి 752 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి కువైట్ మంచి దుబారు మీదుగా శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అనుమా నంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసి రూ.20 లక్షల విలువైన 331 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు లక్ష రూపాయ ల విలువైన విదేశీ సిగరెట్లను పట్టుకున్నారు. ము గ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకొని బంగా రాన్ని సిగరెట్లను స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.