మణికొండ మున్సిపాలిటీని ఆదర్శంగా చేస్తా అభివృద్ధి పనులకు శ్రీకారం రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌

నవతెలంగాణ-గండిపేట్‌
రాబోయే రోజుల్లో మణికొండ మున్సిపాలిటీని అభివృద్ధిలో ఆదర్శంగా చేస్తామని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి ప్రకాష్‌ గౌడ్‌ తెలిపారు. గురువారం మణికొండ మున్సిపాలిటీలోని పలు వార్డులో సీసీ రోడ్డు, డ్రైవర్‌ ఓనర్‌ పద్ధతిపై ఆటోలను, చిత్రపురి కాలనీలో బస్తీ దావకాన ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మణికొండ మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు నిత్యం కృషి చేస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులను చేస్తున్నట్టు తెలిపారు. మణికొండకు ప్రత్యేకంగా వేలకోట్ల రూపాయలతో పలు కాలనీలో అభివృద్ధి పనులు చేసినట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో దశలవారీగా పెండింగ్‌ పనులను పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో కమిషనర్‌ పాల్గొన కుమార్‌, దివ్య జ్యోతి, చైర్మన్‌ నరేందర్‌, కౌన్సిలర్లు కోఆప్షన్‌ సభ్యులు, ఏఈ ఈ సాయి మౌనిక, డిఎంహెచ్‌ఓ వెంకటేశ్వరరావు, డిప్యూటీ డిహెచ్‌ఓ సృజన, నార్సింగ్‌ ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్‌ పద్మ, మున్సిపల్‌ సిబ్బంది అధికారులు, టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ అధ్యక్షులు శ్రీరాములు, శ్రీకాంత్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love