నవతెలంగాణ-షాబాద్
షాబాద్ మండల కేంద్రంలో పోచమ్మ బోనాలు గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త రవీందర్ ఇంటి నుం చి బోనాల ఊరేగింపు ప్రారంభమైంది. శివ సత్తుల పునాకలతో, బోతురాజుల విన్యానలతో, యువకులు కేరింతలతో ఘనంగా బోనాలు, తొట్టెల ఊరేగింపు జరిగింది. పోచమ్మ తల్లిని ఊరువాడ జల్లగా చూడు తల్లి, వర్షాలు కురు పించి ప్రజలను సుఖసంతోషాలతో ఉండే విధంగా చూడు తల్లి లని కోరుతూ మహిళలు తమ బోనాల నైవేధ్యాన్ని పోచమ్మ తల్లికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు ఉన్నారు.