పార్టీలోకి చేరికలు, భవిష్యత్ కాంగ్రెస్‌దే, జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి
నవతెలంగాణ-కుల్కచర్ల
పేదలకు కాంగ్రెస్‌తోనే న్యాయం జరుగుతుందని, భవిష్యత్లో కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయమని డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం కుల్కచర్ల మండలం రాంరెడ్డి పల్లి గ్రామ బీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు 50 మంది రామ్మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న కాలంలో కాంగ్రెస్ తిరుగు లేని శక్తిగా మారుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు ముదిరాజ్, జిల్లా జనరల్ సెక్రెటరీ హనుమంతు ముదిరాజ్,జిల్లా ఉపాధ్యక్షు లు లాల్ కష్ణ, పట్టణ అధ్యక్షులు ఎర్రగడ్డపల్లి కష్ణ, జిల్లా కార్యదర్శులు నర్సింలు యాదవ్ అడ్వకేట్, జిల్లా కార్యదర్శి యాదయ్య యాదవ్ అడ్వకేట్, మహిళా విభాగం అధ్యక్షు రాలు ముజాహిద్ పూర్ సర్పంచ్ లక్ష్మీ ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.