నవతెలంగాణ-గండిపేట్
ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటు చేసుకుంది. నార్సింగి పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గండిపేట్ మండలం కోకాపేట్ గ్రామానికి చెందిన ముంగి మనీష్‌రెడ్డి(23) ఏడాది క్రితం బీటేక్ పూర్తి చేశారు. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటన స్థలాన్ని ఎస్‌ఐ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.