మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

– మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా రంగారెడ్డి అధ్యక్షులు ప్రవీణ్‌
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
మధ్యాహ్నం భోజన కార్మికుల ఎదుర్కొంటున్న స మస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా రంగారెడ్డి అధ్యక్షులు ప్రవీణ్‌ అన్నారు. గురువారం రాజేంద్రనగర్‌, గండిపేట్‌ మండలానికి సంబంధించిన మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాల లో మధ్యాహ్న భోజన పథకాన్ని పూర్తిగా రద్దుచేసి అక్షయపా త్రకు ఇవ్వడం వలన మధ్యాహ్న భోజన కార్మికులు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. 2002 బడ్జెట్‌ సమా వేశంలో సీఎం కేసీఆర్‌ మధ్యాహ్న భోజన కార్మికులకు వేత నాలు పెంచుతున్నామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని, కానీ అది ఇప్పటివరకు అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చే శారు. అదేవిధంగా కార్మికులకు పెండింగ్‌లో ఉన్న బిల్లుల ను వెంటనే చెల్లించాలని కోరారు. మధ్యాహ్నం భోజనం పథకం నిర్వహణ అక్షయపాత్రకు అప్పజెప్పడాన్ని విరమిం చుకోవాలిలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 10, 11, 12 తేదీల్లో మూడు రోజుల పాటు టోకెన్‌ సమ్మె చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందజేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు రుద్రకుమార్‌, గండిపేట మండల కన్వీనర్‌ ప్రవీణ్‌ కుమార్‌, మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.

Spread the love