కౌలు రైతులను ఆదుకోని ప్రభుత్వం

– అర్హులకు దక్కని ప్రభుత్వ సాయం,కౌలు సర్టిఫికెట్లు
– కౌలు రైతులకు దక్కని రైతు బంధు
– ఆర్థిక ఇబ్బందుల్లో కౌలు రైతులు
– పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ-తాండూరు
తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని చెబుతున్నా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీరా రైతుల కష్టాలను తీర్చడంలో విఫలమవుతుంది. రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న మంత్రులు, నాయకుల మాటలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. వారి మాటలు నీటి మూటలుగానే మిగు తున్నాయి. కౌలు రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారి గురించి ఏమాత్రమూ పట్టించుకోకపోవడం దారుణం. గ్రామాల్లో కౌలు రైతులు కుటుంబాన్ని సాగేందుకు ఉన్న ఊరిలో భూములు తీసుకొని కౌలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 2013లో అప్పటి ప్రభుత్వం కౌలు రైతు లకు నామ మాత్రపు సర్టిపికెట్లు అందజేశారు. అయినా సర్టిఫికెట్లు ఉన్న వారికి బ్యాంకర్లు రుణాలు ఇవ్వడంలో నిరాకరిస్తున్నారు. గ్రామాల్లో వందల సంఖ్యలో రైతులు గ్రామాల్లోని భూస్వాముల నుండి, ఇతర రైతులనుండి భూములను కౌలుకు వేసుకొని పంటలను సాగు చేసుకుం టున్నారు. పంటల సాగు కోసం రైతులు గ్రామాల్లో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. తాండూరు నియోజక వర్గంలోని 143గ్రామ పంచాయతీల్లో సుమారు 9250 మంది కౌలు రైతులున్నారు. బషీరాబాద్‌ మండలం లో 3వేల మంది కౌలు రైతులున్నారు. యాలాల్లో 2400 తాండూరులో 1000, పెద్దేముల్‌లో 2800 కౌలు రైతులు ఉన్నట్లు సమాచారం. ప్రతీ గ్రామ పంచాయతీలో 150 నుండి 200 మంది కౌలు రైతులు పంటలు సాగు చేసుకుం టున్నారు. మండల తహశీల్దార్‌ కార్యాలయాల్లో కౌలు రైతుల వివరాలు లేకపోవడం శోచనీయం. గ్రామాల్లో చిన్న రైతులు భూస్వాముల నుండి పెద్ద రైతుల నుండి 2 ఎకరాల 10ఎకరాల భూమి వరకు కౌలుకు వేసుకొని సాగు చేస్తున్నారు. వారికి కౌలుదారు పట్టా సర్టిఫికెట్లు అందిం చడంలో అధికారులు, నాయకులు విఫలమవుతున్నారు. కౌలుదారు పట్టా సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు సంబంధిత భూమి యజమానితో ఎలాంటి అభ్యంతరమూ (నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌) లేకుంటేనే కౌలు రైతులు సర్టిఫికెట్లు ఇస్తామని గతంలో చెప్పడంతో చాలా మంది యజమానులు కౌలు రైతులకు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు అభ్యంతరాలు తెలిపారు. దీంతో నిజమైన చాలా మంది కౌలు రైతులకు కౌలుదారు పట్టా సర్టిఫికెట్లు అందలేదు. గ్రామాల్లో రెవెన్యూ అధికా రులు వ్యవసాయ అధికారులు పర్యటించి నిజమైన కౌలు దారు రైతులకు కౌలు సర్టిఫికెట్లు అందించేందుకు చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం. గ్రామాల్లో మాత్రం కౌలు రైతు లు పంటలను సాగు చేస్తూ అతివృష్టి, అనావృష్టి కారణాలతో అప్పుల పాలవుతున్నారు. కౌలు రైతులకు సర్టి ఫికెట్లు ఉన్న వారికి కూడా బ్యాంకుల్లో రుణాలు అందడం లేదు. రైతులు బ్యాంకుకు రుణాల కోసం పోతే అందుకు ముందే ఆ భూమి యజమాని ఆ భూమిపై రుణం పొంది ఉన్నాడని బ్యాంక్‌ అదికారులు అంటున్నారని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములను కౌలుకు తీసుకొని పంటల సాగు చేస్తే వాతవరణ పరిస్థితుల కారణంగా అప్పు లే మిగులుతున్నాయని పలువురు కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగు కోసం వేల రూపాయాలు ఖర్చు పెట్టి నష్టపోతే తమకు ప్రభుత్వం అందించే పంటల నష్టపరిహారం, రైతు బంధు పథకం డబ్బులు అందడం లేద ని కౌలు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన అధికారులు నాయకులు స్పందించి కౌలు రైతులను ఆదుకో వాలని ఆయా గ్రామాల కౌలు రైతులు వేడుకుంటున్నారు.
కౌలు పట్టా సర్టిఫికెట్లు ఇవ్వలేదు, రైతు బంధు పథకం డబ్బుఇస్తే బాగుంటుంది:
రైతు చంద్రప్ప
గ్రామంలో ఐదేళ్ల నుండి భూమిని సాగు చేసుకుం టున్నాని తనకు కౌలు సర్టిఫికెట్లు ఇవ్వాలని పలు మార్లు అధికారులను అడిగినా పట్టించుకోవడం లేదు. వ్యవసాయ పంటల సాగు కోసం వేల రూపాయాలు ప్రయివేట్‌ వ్యక్తుల దగ్గర అప్పు చేయాల్సి వస్తుంది. ఇప్పటికైన ప్రభుత్వం స్పం దించి కౌలు సర్టిఫికెట్లు ఇచ్చి పంట రుణం ఇప్పిస్తే బాగుం టుంది. రైతు బంధు పథకం బాగుంది.
కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి:
రైతు అంజిలప్ప
కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రైతులకు కౌలు సర్టిఫికెట్లు ఇచ్చి బ్యాంకుల్లో రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటే బాగుంటుంది. గ్రామాల్లో పంటల సా గుకోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల పాలవు తున్నాం.ప్రభుత్వం కౌలు రైతులకు న్యాయం చేస్తే బాగుం టుంది.
కౌలు రైతులకే రైతు బంధు, పంట నష్ట పరిహారం ఇవ్వాలి: రైతు గోపాల్‌
కౌలు రైతులకు రైతు బంధు డబ్బులు, పంట నష్టప రిహారం ఇవ్వాలి. పంటలు సాగు చేస్తున్న కౌలు రైతులకు పంట నష్టపరిహారం అందడం లేదు. పంటలు సాగుచేసి నష్టపోయి అప్పుల పాలవుతున్నాం. ప్రభుత్వం కౌలు రైతుల కు న్యాయం చేయాలి.

Spread the love