– పాల్గొన్న ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
నవతెలంగాణ-చౌడాపూర్
మండల కేంద్రంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యాదినోత్సవ వేడుకలను ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మా ట్లాడుతూ…’మనఊరు మనబడి’ కార్యక్రమం దేశా నికే ఆదర్శమన్నారు. అనంతరం డిజిటల్ క్లాస్‌రూమ్స్, సైన్స్ లాబ్స్‌లను ప్రారంభించి విద్యార్థులకు పాఠ్య పుస్త కాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయ కులు, అధికారులు, విద్యార్థులు, తదితరులున్నారు.