విద్యా ప్రమాణాలను పెంచుతాం

– కోకాపేటలో విద్యా దినోత్సవ వేడుకలు
– అదనపు తరగతి గదుల ప్రారంభం
– నోటు పుస్తకాలు, దుస్తులు అందజేత
– రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌
నవతెలంగాణ-గండిపేట్‌
సీఎం కేసీఆర్‌ హయంలో పేద విద్యార్థులకు విద్యా ప్రమాణాలు పెంచామని ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ అన్నారు. మంగళవారం గండిపేట్‌ మండల్‌ మున్సిపాలిటీలోని కోకాపేట్‌ గ్రామంలో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ఊరు మనబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు ప్రయివేటు సంస్థ ఏర్పాటుచేసిన నూతన అదనపు భవనాలను ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రభుత్వంలో సకల సౌకర్యాలు కల్పించినట్టు తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. కౌన్సిలర్‌ శివ రెడ్డి చొరవ ఎంతో ఉందన్నారు. వారి కృషితో ప్రయివేటు సంస్థల సహకారంతో అదనపు గదులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మంచినీటి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. మధ్యాహ్న భోజనంతో పాటు నేటి నుంచి విద్యార్థులకు ఉదయం అల్పాహారం పేరుతో రాగిజావ అందజేస్తున్నట్టు తెలిపారు. ఇంగ్లీష్‌ బోధనతోపాటు డిజిటల్‌ క్లాసులను వారు ప్రారంభించారు. విద్యార్థులందరూ పుష్టిగా తిని మంచిగా చదువుకోవాలని సూచించారు. స్థానిక ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలని ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందజేశారు. 20 మంది ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా కేవలం 9 మంది ఉన్నట్టు వారు ఎమ్మెల్యేకు వివరించారు. ఉపాధ్యాయుల సంఖ్య పెంచేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని తెలిపారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు, దుస్తులు అందజేశారు. కార్యక్రమంలో కమిషనర్‌ సత్తిబాబు, డి ఈ నరసింహారాజ్‌, మేనేజర్‌, చైర్‌ పర్సన్‌ రేఖ యాదగిరి, వైస్‌ చైర్మన్‌ వెంకటేష్‌ యాదవ్‌, కౌన్సిలర్‌ గంగిడి శివ రెడ్డి, మండల అధ్యక్షులు రామేశ్వరం నరసింహ, మాజీ ఎంపీపీ తలారి మల్లేష్‌, చంద్రశేఖర్‌ రెడ్డి, హరి శంకర్‌, రాము యాదవ్‌, మల్లేష్‌ యాదవ్‌, మండల విద్యాధికారి రాంరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, కౌన్సిలర్లు పత్తి ప్రవీణ్‌ కుమార్‌, దుర్గేష్‌, పత్తి శ్రీకాంత్‌, ఉపాధ్యాయులు, విశ్వనాధ్‌, సునీల్‌, మైపాల్‌, గణేష్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రెస్టేజ్‌ సంస్థ నిర్వాహకులు, అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Spread the love