కల్లుగీత కార్మికులకు ఇన్సూరెన్స్‌ కల్పించాలి

కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కౌన్సిలర్‌ మెంబర్‌ చింతక్రింది ప్రభాకర్‌గౌడ్‌
నవతెలంగాణ-శంకర్‌పల్లి
కల్లుగీత కార్మికులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్‌ కల్పించాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కౌన్సిలర్‌ మెంబర్‌ చింతకింది ప్రభాకర్‌ గౌడ్‌ అన్నారు.బుధవారం శంకర్‌పల్లి మండలంలోని కల్లుదుకాణం ఎదుట తెలంగాణ రాష్ట్ర గీత కార్మిక సంఘం 2023- క్యాలండర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ శంకర్‌పల్లి మండలంలో సర్దార్‌ పాపన్న గౌడ్‌ విగ్రహం, బొమ్మన్న గారి ధర్మబిక్షంగౌడ్‌ విగ్రహం, శంకర్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసుకోవాలని శంకర్‌పల్లి గీతా కార్మిక సంఘానికి సూచించారు.కల్లుగీత కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్‌ కల్పించి, 55 ఏండ్లు నిండిన ప్రతి గీత కార్మికునికి ప్రతి నెలా రూ. 3 వేల పింఛన్‌ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ భూముల్లో కల్లుగీత కార్మికుల కోసం ఈత మొక్కలు పెంచుకునే విధంగా ప్రభుత్వం కృషి చేయాలన్నారున.ఆ సంఘం శంకర్‌పల్లి మండల సంఘం అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్‌ మాట్లాడుతూ ప్రతి గ్రామానికి ప్రతి సొసైటీకి 10 నుంచి 5 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈత వనం, తాటి చెట్లు, ఖర్జూర చెట్లు, మొక్కలు నాటే విధంగా ప్రభుత్వం కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో డి. సత్యనారా యణగౌడ్‌, ఎల్‌ హరి శంకర్‌గౌడ్‌, నర్సింలుగౌడ్‌, అంజయ్యగౌడ్‌, జయలక్ష్మణ్‌ గౌడ్‌, బి. రాములుగౌడ్‌, వి. నరసింహులు గౌడ్‌, పి. పాండు గౌడు, శంకర్‌ గౌడ్‌, రాజు గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love