వైభవంగా ధ్వజస్తంభ, బొడ్రాయి విగ్రహాల ప్రతిష్టాపన

నవతెలంగాణ – కొడంగల్/ దౌల్తాబాద్

గుండె పల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి, బొడ్రాయి, ధ్వజస్తంభ ప్రతిష్టాపన శుక్రవారం వైభవంగా సాగింది. స్వాముల ఆధ్వర్యంలో మూడు రోజుల నుంచి హోమాలు, పూజలు నిర్వహించారు. చివరి రోజు ప్రతిష్టాపనకు వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఉదయాన్నే ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించారు. గుండె పల్లి గ్రామ ప్రజల ఆడపడుచులు, బంధువులు పెద్ద ఎత్తున గ్రామానికి చేరుకోవడంతో గ్రామంలో పెద్ద ఎత్తున పండుగ వాతావరణం నెలకొంది, భక్తులందరికీ  అన్నదానం ఏర్పాటు చేశారు. ఇంటి ఆడ కూతుళ్లకు కొత్త వస్త్రాలు పెట్టి ఒడి బియ్యంతో దర్శనం చేసుకున్నారు.

ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి

విగ్రహాలు, ధ్వజస్తంభ ప్రతిష్టాపన సందర్భంగా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి  గ్రామానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన  రాక సందర్భంగా సర్పంచ్ మధుసూదన్ రెడ్డి , గ్రామ ప్రజలు సాయి రెడ్డి, నర్సప్ప, వెంకట్రామ్ రెడ్డి, ఆంజనేయులు, మహిపాల్ లు  పెద్ద ఎత్తున స్వాగతం పలికి పూలదండతో సన్మానించారు.   ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలో మంచి పాడి పంటలు పండాలన్నారు, విగ్రహాల ప్రతిష్టాపనతో గ్రామంలో మంచి వర్షం కురిసి మంచి పంటలతో గ్రామస్తులు సంతోషంగా ఉండాలని కోరారు,  ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కోట్ల మహిపాల్,బిఆర్ఎస్ మండల అధ్యక్షులు ప్రమోద్ రావు, మాజీ జెడ్పిటిసి మోహన్ రెడ్డి, కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్, శ్రీధర్ రావు, ఉప సర్పంచ్ నాగప్ప, వసంత్ రావు, విజయరావ్, అనంత్ రెడ్డి, చెన్నకేశవరెడ్డి, భీమయ్య, భీమ్ రెడ్డి, నరసింహ, ఆంజనేయులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Spread the love