ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ..

నవతెలంగాణ- గోవిందరావుపేట
ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధితులకు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ గోవిందరావుపేట మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ అందజేశారు. మండలంలోని చల్వాయి గ్రామానికి చెందిన మాచర్ల స్ఫూర్తి (13000/-) మరియు చెవుగాని ఆంజనేయులు (9000/-) ల కు అనారోగ్యం కారణంగా వైద్యశాలకు అయిన ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు రాగా అట్టి చెక్కులను సీతక్క ఆదేశాల మేరకు అందించినట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఇంఛార్జి కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, చల్వాయి గ్రామ కమిటీ అధ్యక్షుడు వేల్పుగొండ ప్రకాష్, ఎంపీటీసీలు గుండేబోయిన నాగలక్ష్మి – అనిల్ యాదవ్, చాపల ఉమాదేవి – నరేందర్ రెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ తేళ్ల హరిప్రసాద్, వెల్పుగొండ పూర్ణ, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, సామ శ్రీను, పెద్దాపురం మొగిలి తదితర నాయకులు పాల్గొన్నారు.

Spread the love