– భూక్య మోహన్ రాథోడ్ రాంనగర్ సర్పంచ్
నవతెలంగాణ- గోవిందరావుపేట
మారుమూల గ్రామీణ ప్రాంతాల చిన్న పంచాయతీల అభివృద్ధికి నిధులు కేటాయించి పెద్దపీట వేస్తున్నారని రాంనగర్ సర్పంచ్ బుక్క్యామోహన్ రాథోడ్ అన్నారు. శుక్రవారం రాంనగర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్ బి నగర్ నుండి రాంనగర్ వరకు ట్రైబల్ వెల్ఫేర్ ఫండ్ నుంచి 70 లక్షలు బీటీ రోడ్డు రోడ్ పనులను సర్పంచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మోహన్ రాథోడ్ మాట్లాడుతూ చిన్న గ్రామాలైన మరమురా ప్రాంతాలు తండాలను అభివృద్ధి పథంలో ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క ఆలోచనను ఎంతో గొప్పదని కొనియాడుతూ మా యొక్క ఊరికి కనెక్టివిటీ రోడ్డును అందించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ కి అలాగే దివంగత నేత జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ నంబర్ సనప కృష్ణారావు కోప్సన్ సభ్యులు వగవత్ సారయ్య మరియు ఎల్బి నగర్ పెద్దమనిషిలు అట్టం నాగరాజు నల్లబోనన్ కృష్ణారావు .ఈసం రజబబు . కబ్బాక జగదిస్వరావు . కొటే వెంకటేశ్వరరావు . మరియు పంచాయితీ సెక్రటరీ నారిన్ కుమార్ పాల్గొన్నారు.