నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని గాంధీనగర్ గ్రామంలో గురువారం బాలుడు కుంటలో పడి మృతి చెందగా శుక్రవారం మృతిని కుటుంబాన్ని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ ప్రహ్లాద్ పరామర్శించి ఓదార్చారు. బాలుని తండ్రి మాలోతు చందు ను ఇలాంటి పరిస్థితుల్లో మనోధైర్యంగా ఉండాలని సూచించి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో రాంనగర్ సర్పంచ్ భూక్యా మోహన్. లక్ష్మీపురం సర్పంచ్ లావుడ్య స్వాతివాగ, మాలోత్ గాంధీ, లావుడ్య గణేష్ లాల్, జర్పుల జగన్, లాకావత్ నర్సింహా, భూక్యా వెంకటేష్,లాకావత్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.