నూతన వధూవరులను ఆశీర్వదించిన డాక్టర్ ప్రహ్లాద్

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని చంద్రు తండా గ్రామంలో గుగులోతు రవీందర్ నాయక్ కుమార్తె వివాహానికి శుక్రవారం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ ప్రహ్లాద్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మార్గమధ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద కాసేపు ఆగి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ములుగు నియోజకవర్గం టిఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న డాక్టర్ ప్రహ్లాద్ పర్యటన మండలంలో ప్రాధాన్యత చోటు చేసుకుంది. డాక్టర్ ప్రహ్లాద్ మండలానికి వస్తున్నారన్న ప్రచారం విస్తృతంగా వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో సర్పంచులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు డాక్టర్ ప్రహ్లాదునీ కలిసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love