నేటి క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ లో క్రమబద్ధీకరణకై నిర్ణయం తీసుకోవాలి..

నవతెలంగాణ -డిచ్ పల్లి
శుక్రవారం జరగబోయే మంత్రివర్గ ఉప సంఘం భేటీలో  12 యూనివర్సిటీల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ల రెగ్యులరైజ్ పై నిర్ణయం తీసుకోవాలని, ఈ నిర్ణయంతో రెగ్యులరైజ్ అనే ఒకే ఒక పదంతో ముందుకు తీసుకెళ్లాలని సబ్ కమిటీలు ఉన్న మంత్రులందరికి తెలంగాణ యూనివర్సిటీ చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు గురువారం కలిసి వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా యొక్క ఏకైక లక్ష్యం రెగ్యులరైజ్ ఈ రెగ్యులరైజ్ ప్రక్రియ ను సబ్ కమిటీలు తప్పనిసరి ఆమోదించాలని 1యూనివర్సిటీలకు చెందిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ప్రధాన డిమాండ్ అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ లోని  ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల  ముందు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ తమ రిజర్వేషన్ లను కల్పించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అధ్యక్షులు జాక్ కో కన్వీనర్ డాక్టర్ వి దత్తాహరి, గంగ కిషన్, శరత్, మోహన్, సిహెచ్ శ్రీనివాస్, జి శ్రీనివాస్, కిరణ్ రాథోడ్, సందీప్, నర్సింలు, గోపి రాజ్ డానియల్ నాగేంద్రబాబు, నాగేశ్వరరావు, మోహన్ ,జోష్ణ, డాక్టర్ రాజేశ్వర్, అపర్ణ, తో పాటు ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.
Spread the love