లేబర్ కార్డు దారులకు ఉచిత వైద్య శిబిరం..

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల కేంద్రంలో మంగళవారం (సి ఎస్ సి) కామన్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో లేబర్ కార్డుదారులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.తెలంగాణ ప్రభుత్వం భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ రంగ కార్మికుల కోసం మండల కేంద్రంలోని గ్రామ పంచాయితీ కార్యాలయం లో ఈ సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ సందీప్ ఆధ్వర్యంలో, సర్పంచ్ లక్ష్మి జో, కార్యదర్శి శంకర్, ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు , ఈ శిబిరంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న లేబర్ కార్మికులకు, రక్త పరీక్షలు, చెవి, కంటి మరియు శ్వాస కోశ సంబంధిత పరీక్షలు సుమారు 50 రకముల పరీక్షలు చేశారు. గ్రామంలో సుమారు 100 మంది లేబర్ కార్డ్ దారులకు ఈ పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ కో ఆర్డినేటర్ రమేష్ , మరియు కామన్ సర్వీస్ సెంటర్. సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love