విద్యుత్ స్తంభాలను పక్కకు మార్చాలి: మాన్య తండా ప్రజలు

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని రాంనగర్ పంచాయతీ మాన్య తండాకు సిసి రహదారి మంజూరి అయింది. గతంలో ఎప్పుడూ వేసిన విద్యుత్తు పోల్స్ ఇప్పుడు రహదారి మధ్యలో వస్తున్నాయి. అట్టి పోల్స్ ను మార్చాలని మాన్య తండా ప్రజలు కోరుతున్నారు. బుధవారం గ్రామానికి చెందిన అజ్మీర సమ్మల్ మాట్లాడుతూ విద్యుత్ లైన్ మార్చేందుకు సర్పంచిని అడిగితే నిధులు లేవంటున్నారు. విద్యుత్ అధికారులను అడిగితే స్పందించడం లేదు. విద్యుత్ మీటర్లకు డబ్బులు కడితే మార్చడం సాధ్యమవుతుందని అంటున్నారు. రాకరాక గ్రామానికి సిసి రహదారి మంజూరు అయితే రహదారి మధ్యలో విద్యుత్ పోల్స్ ఉంటే ఎట్లా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఉన్నత అధికారులు కానీ ఉన్నత ప్రజా ప్రతినిధులు గాని స్పందించి తమకు న్యాయం చేయాలని అంటున్నారు. గ్రామస్తులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. గ్రామంలో సుమారు 30కి పైగా కుటుంబాలు తండాలో నివసిస్తున్నారు. ఎవరైనా పట్టించుకోని సమస్యకు పరిష్కారం చూపించాలని కోరుతున్నారు.

Spread the love