నవతెలంగాణ- బెజ్జంకి
మండల పరిధిలోని తోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎఎన్ఎం రాధ అధ్వర్యంలో మంగళవారం గాగీల్లపూర్ గ్రామ పంచాయతీ కార్యలయం వద్ద గ్రామస్తులకు ఉచిత రక్తపోటు,మధుమేహం వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ వైద్య సేవలను ప్రత్యేక శ్రద్ధ వసించి గ్రామస్తుల చెంతకు తీసుకురావడం అనందనీయమని ఎఎన్ఎం రాధను సర్పంచ్ అన్నాడీ సత్యనారాయణ రెడ్డి అభినందించారు.ప్రభుత్వ వైద్య సేవలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి సూచించారు.ఎంపీటీసీ కొమిరే మల్లేశం,ఆశా కార్యకర్తలు పద్మ,తృతియా వర్ణ పాల్గొన్నారు.