వినోద్ కు ఉత్తమ ఫార్మసిస్ట్ అవార్డు..

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని పసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన వినోద్ ఉత్తమ ఫార్మసిస్ట్ అవార్డు కలెక్టర్ కృష్ణ ఆదిత్య చేతుల మీదుగా బుధవారం అందుకున్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నేటి వైద్య ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని ఉత్తమ ఉద్యోగులను గుర్తించి ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. దీనిలో భాగంగా పసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన వినోద్ కు ఉత్తమ ఫార్మసిస్ట్ అవార్డు అందుకున్నారు. వినోద్ ఉత్తమ ఫార్మసిస్ట్ అవార్డు అందుకోవడంతో మిత్రులు శ్రేయోభిలాషులు తోటి ఉద్యోగులు బంధువులు పెద్ద సంఖ్యలో వినోద్ కు అభినందనలు తెలిపారు. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని అవార్డు సందర్భంగా అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

Spread the love