ప్రభుత్వ ఉపాధ్యాయునిపై భౌతికదాడిని టీఎస్ యుటిఎఫ్ తీవ్రఖండన

– టీఎస్ యుటిఎఫ్ తాడ్వాయి మండల శాఖ
– చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్
నవతెలంగాణ-తాడ్వాయి

మండలంలోని బీరెల్లి  గ్రామపంచాయతీ పరిధిలో గల ఆశన్నగూడ ఎల్లాపూర్ లో ని జిపిఎస్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు తోలెం రవికుమార్ పై విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న సమయంలో పాఠశాలలోకి వెళ్లి విచక్షణారహితంగా బూతు మాటలు తిట్టుకుంటూ, భౌతిక దాడి నిర్వహించిన మెస్సు శివకుమార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని టీఎస్ యుటిఎఫ్ మండల శాఖ పేర్కొంది. ప్రభుత్వ ఉపాధ్యాయునిపై భౌతిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షులు సుతారి పాపారావు అన్నారు. మండల కేంద్రంలో టీఎస్ యుటిఎఫ్ ఉపాధ్యాయుల బృందంతో నిరసన తెలియజేశారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు తోలెం రవికుమార్ పై కారణంగా పాఠశాలలోకి ప్రవేశించి హాజరు రిజిస్టర్ను చింపి, బూతులు తిడుతూ, భౌతిక దాడి చేసిన మిస్స్ శివకుమార్ పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే మండల, జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉధృతంగా ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహిస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఫనికుమర్, నాగేశ్వరరావు, హనుమంత్, బుచ్చయ్య, లింగయ్య, గ్రామస్తులు ఆదినారాయణ, వట్టం వెంకటయ్య, సోలం బుచ్చక్క తదితరులు పాల్గొన్నారు.
Spread the love