యూనివర్సిటీలో రెగ్యులరైజ్ చేయరా…

– యూనివర్సిటీ లో కాంట్రాక్టు అధ్యాపకుల నిరసన..
నవతెలంగాణ – డిచ్ పల్లి
యూనివర్సిటీ లలో విద్యార్థులు నాణ్యమైన విద్య బోధన చేయిస్తూన్న రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజ్ విషయం లో మిన మే‌‌షలు లేక్కీస్తుందని, ఈ తాత్సారం చేయడం బాధాకరమని వేంటనే సర్విస్ ను రెగ్యులరైజ్ చేసే విధంగా చూడాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల అధ్యక్షుడు డాక్టర్ వీ దత్తాహరి మాట్లాడుతూ రాష్ట్రంలోని 12యూనివర్సిటీలో రెగ్యులరైజ్ చేయాలని సర్వీస్ లను క్రమబద్దికరించలని అన్ని యూనివర్సిటీ లకు చెందిన వారందరు సమిష్టిగా నిర్ణయం తీసుకుని అన్ని యూనివర్సిటి లలో నిరంతరం నిరసన, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మన్నారు.తెలంగాయ యూనివర్సిటీ పరిధిలోని సౌత్ క్యాంపస్, బీఈడీ కళాశాల సారంగాపూర్ క్యాంపస్ లలో ఉపాధ్యాయులు అందరూ కలిసి ఈ కార్యక్రమం నిర్వహించ మన్నారు.బుదవారం 11:30 కు యూనివర్సిటీ లోని కాళశాల ముందు నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షుడు డాక్టర్ వీ దత్త హరి పేర్కొన్నారు. అన్ని సంఘాలు ఒకే ఒక డిమాండ్తో ముందుకు వెళ్తున్నామని ఈ డిమాండ్ రెగ్యులరైజ్ టు సర్వీస్ సాధించే వారకు కోని సాగిస్తామని అయిన వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్టు ఉపాధ్యాయులు శరత్, శ్రీనివాస్, పోతురాజు శ్రీనివాస్, నాగేంద్రబాబు, గంగా కిషన్, జోష్ణ, ఈ కామర్స్ శ్రీనివాస్, గంగాధర్, నాగేశ్వరరావు, సందీప్, ఆనంద్, కిరణ్ రాథోడ్, రాజేశ్వరి, రమ్య, నర్సయ్య, రామేశ్వర్ రెడ్డి, గంగ కిషన్, సురేష్ గౌడ్, తోపాటు తదితరులు పాల్గొన్నారు.

Spread the love