స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బుల్లెట్ ర్యాలీ 

నవతెలంగాణ- కంటేశ్వర్
రోటరీ క్లబ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శాంతి సామరస్యం పెంపొందించాలని ఉద్దేశంతో బుల్లెట్ ర్యాలీ కార్యక్రమాన్ని నేడు అనగా ఆదివారం 13 ఆగస్టు 2023న ఉదయం 8 గంటలకు స్థానిక ముబారక్ నగర్ నందు గల వనిల్ ఆటోమోటివ్స్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ నుండి ప్రారంభం అవుతుందని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగర ఏసిపి ఎం కిరణ్ కుమార్ గౌరవ అతిథిగా జాతీయ బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు రాజేందర్ రెడ్డి పాల్గొననున్నారు. ర్యాలీ ముబరాఖ్నగర్, కంటేశ్వర్, శుభం కురోతి కళ్యాణం గణేష్ చౌరస్తా, ఎల్లమ్మ గుట్ట చౌరస్తా, నిఖిల్ సాయి చౌరస్తా, రాజరాజేంద్ర చౌరస్తా ,వర్ని రోడ్ నందు గల వల్లభై పటేల్ విగ్రహం నుండి యు టర్న్ తీసుకొని తిరిగి రాజ రాజేంద్ర చౌరస్తా, బడా బజార్ ,గాంధీ చౌక్ ,బస్టాండ్ మీదుగా మన పాత కలెక్టరేట్ గ్రౌండ్లో కార్యక్రమంతో ముగియనున్నదని ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా లోని బుల్లెట్ ఉన్న వారందరూ కూడా ర్యాలీలో పాల్గొని దేశభక్తిని పెంపొందించాలని కోరడం జరిగినది బుల్లెట్ రైడర్లు అందరూ కూడా తప్పనిసరిగా సేఫ్టీ రూల్స్ మరియు హెల్మెట్లతో ర్యాలీలో పాల్గొనవలసిందిగా క్లబ్ తరఫున కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైడర్లకు టీ షర్టులను అలాగే మౌలిక వసతులూ అనగా రిఫ్రెష్ మెంట్స్ కూడా అందించడం జరుగుతుంది. కార్యక్రమానికి స్పాన్సర్లుగా క్యాస్ట్రాల్ ,సియాట్ ,వనిల్ ఆటోమేటిక్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహరిస్తున్నారు. ఈ పత్రిక ప్రకటనలో ఇంచార్జ్ అధ్యక్షులు జితేంద్ర మలాని, కార్యక్రమ కార్యనిర్వహణ అధికారులు దర్శన్ సింగ్ సోకి, గురుప్రీత్ సింగ్, ఆకుల అశోక్, శ్యామ్ అగర్వాల్ పాల్గోన్నారు.
Spread the love