2023-24లో బ్యాంకు లింకేజీ లక్ష్యం 1032 కోట్లు

– లక్ష్య సాధనలో అందరూ కృషి చేయాలి.. 
– డిఅర్డిఓ,డిఅర్డిఎ పిడి చందర్ నాయక్..

నవతెలంగాణ డిచ్ పల్లి
ఆర్థిక సంవత్సరం 2023-24లో బ్యాంకు లింకేజీ లక్ష్యం 1032 కోట్లు సాధించడానికి అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలని, ఎంటర్ ప్రైజేస్ యూనిట్ల ద్వారా దాదాపు 70 రకాల వ్యాపార యూనిట్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా సబ్సిడీ రుణాలు పొంది 17 రకాల ఆహార ఉత్పత్తుల యూనిట్లను, ఏర్పాటు చేసుకొని  ఆర్థికంగా అభివృద్ధి చెందాలని డిఅర్డిఓ, డిఅర్డిఎ పిడి చందర్ నాయక్ అన్నారు.ఇందూరు జిల్లా మహిళ పరస్పర సహకార సమాఖ్య 71వ కార్యవర్గ సమావేశం డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్ పుర్ శివారు లోని ట్రైజం ట్రైనింగ్ సెంటర్ లో జిల్లా సమాఖ్య అద్యక్షులు  విప్లవ కుమారి  అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా  డిఅర్డిఒ – డిఅర్డిఎ పిడి చందర్ నాయక్ మాట్లాడుతూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా సబ్సిడీ రుణాలు పొంది 17రకల ఆహార యూనిట్లు ఏర్పాటు చేసుకొని ఆహార ఉత్పత్తులను ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, త్వరలోనే జిల్లా సమాఖ్య ద్వారా కూడా యూనిట్లను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.  బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి లకు సంబంధించి అన్ని విభాగాలలో నిజామాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం ద్వారా రాష్ట్ర కో-పరేటివ్ సంస్థ ద్వారా కూడా అవార్డు రావడం గర్వకారణమన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డిఅర్డిఒ మధుసూదన్,డిపిఎం ఎన్ శ్రీనివాస్, సంధ్యారాణి, ఎం.రాచయ్య, మారుతి, ఎపిఎంలు సరోజుని, గంగాధర్, జిల్లా కల్చరల్ కోఆర్డినేటర్ అష్ట గంగాధర్, ఆడిటర్లు, జిల్లా కోశాధికారి వనిత, కార్యదర్శి లక్ష్మీ, జిల్లా సమాఖ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love