త్వరలో ఎంవీఐ సబ్ ఆఫీస్ ప్రారంభిస్తాం

– మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి 
నవతెలంగాణ సిద్ధిపేట
త్వరలో దుబ్బాక మండలంలో ఎంవీఐ(మోటర్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ )సబ్ ఆఫీస్ ప్రారంభిస్తామని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం దుబ్బాక మండల కేంద్రంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎంపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ కార్యక్రమంలో 18 ఏండ్ల దాటిన యువతీ, యువకులు, ప్రజల నుండి స్వయంగా ఎంపీ ధరఖాస్తులు తీసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ దూరపు ప్రాంతాలకు వెళ్లి లైన్సెన్స్ ట్రయల్ కోసం ఇబ్బందులు పడుతున్న విషయం తమ దృష్టి వచ్చిందని అన్నారు. త్వరలోనే దుబ్బాక లో మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఆఫీస్ ప్రారంభిస్తామని తెలిపారు. లర్నింగ్, లైసెన్స్ కోసం వారానికి 3సార్లు ఎంవీఐ వస్తే ఇబ్బందులు తప్పుతాయన్నా పలువురి విజ్ఞప్తి మేరకు తాము కృషి చేస్తామన్నారు. అర్హులైన యువతీ, యువకులకు లైసెన్సులతో పాటు హెల్మెట్లను తాము ఉచితంగా అందిస్తామని, ఈ నెల 13 వరకు  2+4 విల్లర్ లైసెన్స్ , హెల్మెట్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు 4,075 దరఖాస్తులు అందాయన్నారు.కార్యక్రమంలో జడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గన్నే వనితా భూం రెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పాలత కిషన్ రెడ్డి, కౌన్సిలర్లు ఆస యాదగిరి, ఇళ్ళందుల శ్రీనివాస్, రేకుల కుంట ఆలయ ఛైర్మెన్ రొట్టె రమేష్, చిట్టాపుర్ సర్పంచ్ పోతనక రాజయ్య, చికొడ్ సర్పంచ్ తౌడ శ్రీనివాస్, ఏఏంసి డైరెక్టర్లు కోల వెంకట స్వామి గౌడ్, బోడొల్ల దేవరాజ్, బీఆర్ఎస్ నాయకులు చింతల కృష్ణ, యువజన నాయకులు ప్రశాంత్ గౌడ్, పడగాల నరేష్ తదితరులు ఉన్నారు.
Spread the love