రెవెన్యూ అధికారుల పెత్తనాన్ని సహించేది లేదు..

– ప్రభుత్వ అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలి..

– కోఠి లో డీఎంఈ కార్యాలయం ఎదుట తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఆందోళన…
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
ప్రభుత్వ ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గా ఆర్డీవో లను నియమించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులు డాక్టర్ పల్లం ప్రవీణ్ కుమార్. డాక్టర్ బొంగు రమేష్. డాక్టర్ నరహరి. డాక్టర్ రంగ అజ్మీర. డాక్టర్ లాలు ప్రసాద్ రాథోడ్. డాక్టర్ శేఖర్ అన్నారు. శనివారం కోఠి లోని డి ఎం ఈ ప్రాంగణంలో వారు మీడియాతో మాట్లాడుతూ.. దవాఖానాల్లో సూపరింటెండెంట్ తో పాటు అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఆర్డీవోల సేవలను వినియోగించుకోవాలని శుక్రవారం అసెంబ్లీ లో మంత్రి హరీష్ రావు చేసిన తీర్మానాన్ని ఖండిస్తున్నాం అన్నారు.కింది స్థాయి ఉద్యోగం నుండి వచ్చిన ఆర్డీవోలను తమపై పెత్తనం చేయించడం సరికాదని చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం తమ పెండింగ్ సమస్యలను పరిష్కరించకుండాతమపై అజమాయిషీ చేలాయించాలని చూస్తుంది మండిపడ్డారు.మంత్రి హరీష్ రావు చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని కోరారు. డాక్టర్లతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం నిలబడిన చరిత్ర  లేదని చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్లు వైద్య విధాన పరిషత్ లో పనిచేసే వైద్యులను. సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసి వారికి ట్రెజరీ ద్వారా జీతాలు అందించాలని డిమాండ్ చేశారు. 2016 నుండి పి ఆర్ సీ . ఏరియర్స్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ డిమాండ్ చేశారు.  గత కొన్ని ఏళ్లుగా పి ఆర్ సి. ఏరియర్స్ చెల్లించకుండా ఫైల్ పెండింగ్లో పెట్టడం సరికాదన్నారు. రూరల్ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న బోధన వైద్యులకు రూరల్ అలవెన్సులు వెంటనే విడుదల చేయాలన్నారు. టీఎన్జీవో. టీజీవో సంఘాలను మాత్రమే చర్చల కోసం ప్రగతి భవన్ పిలుస్తున్న ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘాన్ని కూడా చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. డాక్టర్ల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరిని విడనాడాలని అన్నారు. డిహెచ్ పరిధిలో టైం బాండ్ ప్రమోషన్లు వెంటనే కల్పించాలన్నారు.తమ సమస్యల పరిష్కారం కోసం త్వరలో వైద్య గర్జన నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులు డాక్టర్ పల్లం ప్రవీణ్ కుమార్. డాక్టర్ బొంగు రమేష్. డాక్టర్ అజ్మీర రంగ.డాక్టర్ లాలు ప్రసాద్ రాథోడ్. డాక్టర్ నరహరి. డాక్టర్ శేఖర్. డాక్టర్ ఉమాకాంత్. డాక్టర్ రాజు. డాక్టర్ వినోద్ .డాక్టర్ శ్రీనివాస్. డాక్టర్ భూపేందర్. డాక్టర్ రవి. డాక్టర్ రమేష్ డాక్టర్ అబ్బయ్య. డాక్టర్ వసంత్. డాక్టర్ కళ్యాణ్ డాక్టర్ లక్ష్మణ్ .డాక్టర్ మురళి. డాక్టర్ శ్రీకాంత్. డాక్టర్ జయశ్రీ డాక్టర్ రాజశ్రీ .డాక్టర్ సునంద. డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love