ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

indian-student-dies-in-road-accident-in-australia

నవతెలంగాణ- ములుగు :ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. జంగాలపల్లి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికుల వివరాల తెలిపిన ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు బైక్ పై హైదరాబాద్ నుంచి ములుగు వస్తున్నారు.  కాగా, జంగాలపల్లి సమీపంలోకి రాగానే వీరి బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. గమనించిన స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిని ముగ్గురిని 108 సిబ్బంది ప్రభుత్వ దవఖాన తరలించారు. దవాఖానలో ఇద్దరు యువకులు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love