విద్యతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు..

– ఘనంగా తెలంగాణ విద్యా దినోత్సవం..
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
విద్యతో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుందని గన్ ఫౌండ్రి డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం చిరాగ్ అలీ లోని జిపిఎస్ కూచే ప్రభుత్వ పాఠశాలలో విద్యా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్ ముఖ్య అతిథిగాభ పాల్గొని పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రాగిజావ పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదవడం కాకుండా ఇష్టపడి చదవడం అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. పట్టుదలతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహిరోహీచాలని ఆకాంక్షించారు. అనంతరం మనబస్తీ మనబడి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల ఐఓఎస్ సత్యవతి. స్కూల్ ఇన్చార్జి హెచ్ఎం కె ఏంజలీనా అర్పిత, సురేష్, బుష్రానిఖిత్, చరిత, ఫోటో గ్రాఫర్ నవ్య నవ్య స్నిగ్ధ, పెద్ద ఎత్తున విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love