కమలం వీడి కారెక్కిన లెనిన్ నగర్ యువత..

– అభివృద్ధిని చూసి బిఆర్ఎస్ లో చేరుకున్న యువకులు.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ – మీర్ పేట్
తెలంగాణ రాష్ట్రం మహేశ్వరం నియోజకవర్గం లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై లెనిన్ నగర్ యువకులు కమలం వీడి కారెక్కుతున్నారని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 35వ డివిజన్ బీజేపీ పార్టీకి చెందిన దాదాపు 60మంది యువకులు బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం, మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యమని యువకులు, విద్యార్థులు, రైతులు టిఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. బంగారు తెలంగాణ లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీకి మద్దతిస్తూ అండగా నిలవాలని ప్రజలను కోరారు.  వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతిఒక్కరు పని చేయాలని నాయకులకు, కార్యకర్తలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం 35వ డివిజన్ కార్పొరేటర్ గిల్లా సౌందర్య విజయ్ ఆధ్వర్యంలో గూడేటి శేఖర్ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఖర్చుల కోసం ఆర్థిక సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా రూ 30 వేలు మంజూరు అయ్యాయి. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును బాధితులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు ముద్ద పవన్, ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ కార్పొరేటర్ సిద్ధాల లావణ్య, బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జేటావత్ శ్రీనివాస్ నాయక్, కార్పొరేటర్లు వేముల నర్సింహా, ఇంద్రావత్ రవి నాయక్, నవీన్, కో ఆప్షన్ సభ్యులు జంగయ్య, శీను నాయక్, యువజన విభాగం ఉపాధ్యక్షుడు అక్విల్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love