– గడప గడప కు కాంగ్రెస్..
– కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు సి కె మూర్తి
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
గోషామహల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు సికే మూర్తి అన్నారు శనివారం కోఠి ఇసామియ బజార్ లోని మేఘరాజ్ భవన్ లో గోషామహల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ గడపగడపకు కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. గోషామహల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసిన కమ్యూనిటీ హాల్ లు. ఇందిరమ్మ ఇండ్లు. ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు. రేషన్ కార్డులు. పింఛన్లు. ఆరోగ్యశ్రీ కార్డులు. యువతకు ఉపాధి లాంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అందించినవే కొనసాగుతున్నాయని చెప్పారు. కొత్తగా ఎలాంటి పథకం ప్రజలకు అందడం లేదని అన్నారు. మళ్లీ గోషామహల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పారు. నియోజకవర్గంలోని ఆరు డివిజన్ లలో పార్టీ కార్యకర్తలు బలంగా ఉన్నారని చెప్పారు. ప్రతి కార్యకర్త సైనికుడి వలె కాంగ్రెస్ పార్టీకి పని చేయాలని కార్యకర్తలకు పులుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే రానున్నాయని ప్రతి కార్యకర్త నియోజకవర్గం లోని ప్రతి గడపకు వెళ్లి, ప్రతి ఓటర్ ను కలిసి కాంగ్రెస్ పార్టీ అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ వివరించాలని సూచించారు. కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ తోనే ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పిసిసి మాజీ కార్యదర్శి బండ అశోక్ . తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ యాదవ్ .మైనార్టీ సెల్ సిటీ వైస్ ప్రెసిడెంట్ ఖదీర్. పిసిసి మీడియా కో-ఆర్డినేటర్ శ్రీకాంత్ యాదవ్. గన్ ఫౌండ్రీ డివిజన్ అధ్యక్షుడు చంద్రమోహన్ యాదవ్. గోషామహల్ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ కన్నయ్య లాల్ యాదవ్ .అధ్యక్షుడు కైలాస్ సింగ్. దత్తాత్రేయ నగర్ డివిజన్ అధ్యక్షుడు జహంగీర్. జాంబాగ్ డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్. మంగళ హాట్ డివిజన్ అధ్యక్షుడు లక్ష్మణ్ సింగ్. గోషామహల్ మహిళా అధ్యక్షురాలు రోసి. హరి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు. కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు