ప్రతిరోజు ప్రతి ఇంటికి మంచి నీళ్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం..

– మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్.
నవతెలంగాణ – మీర్ పేట్
ప్రతిరోజు ప్రతి ఇంటికి మంచినీళ్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం అని మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ మంచినీళ్ల పండుగ దినోత్సవాన్ని కార్పొరేషన్ పరిధిలోని 20వ డివిజన్ సాహెబ్ నగర్ నుండి జిల్లెలగూడ వాటర్ ట్యాంక్ వరకు ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహాన్ మాట్లాడుతూ తెలంగాణ కెసిఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ భగీరథతో అందరికీ మంచినీళ్లు ఇబ్బంది లేకుండా ప్రతిరోజు మంచినీళ్లు ఇస్తున్నట్లు తెలిపారు. మంచినీళ్లకు ఇబ్బందులు లేకుండా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు. నియోజకవర్గంలోనూ ప్రతి ఇంటికి ప్రతిరోజు మంచినీళ్లు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పించి వేల కోట్ల రూపాయలు తీసుకువచ్చిన ఘనత మంత్రి సబితా ఇంద్రారెడ్డిదని కొనియాడారు. అనంతరం వాటర్ వర్క్స్ సిబ్బందిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బాలమణి, పద్మ అంజయ్య, వాటర్ వర్క్స్ సిజిఎం అమరేందర్ రెడ్డి, జిఎం శ్రీనివాస్ రెడ్డి, డీజీఎంఎస్ మేనేజర్స్, కాలనీవాసులు నర్సిరెడ్డి, హాము నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love