ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఆద్వర్యం వైద్య శిభిరం 

నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట ప్రాధమిక ఆరోగ్యం పరిధిలోని మారుమూల గిరిజన గ్రామమైన దురద పాడు వైద్యాధికారి రాందాస్ పర్యవేక్షణలో గురువారం ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఇందులో 32 మందికి పలు రకాల చిరు వ్యాధులకు చికిత్స అందజేసారు.జ్వరంతో బాధపడుతున్న ఆరుగురిని  గుర్తించి రక్త నమూనాలు సేకరించి మలేరియా నిర్ధారణ కొరకు నిర్ధారణ కొరకు ఆర్.డి.టి పరీక్ష నిర్వహించగా మలేరియా లేదని తేలింది. సాధారణ జ్వరాలుకు చికిత్స చేసారు.నలుగురు గర్భిణి స్త్రీలను పరీక్షించి పౌష్టికాహారం, ఆకు కూరలు,గ్రుడ్లు తీసుకోవాలని,ప్రసవం కొరకు ప్రభుత్వం ఆసుపత్రి కే రావాలని సూచించారు.వారికి కేసీఆర్ కిట్ పై అవగాహన కల్పించారు. ఈ శిభిరంలో స్థానిక సర్పంచ్ కుంజా లక్ష్మి, కార్యదర్శి జగదీష్, సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వర రావు, హెల్త్ అసిస్టెంట్ సత్యనారాయణ, ఏఎన్ఎం చెల్లమ్మ, ఆశా కార్యకర్తలు గృహ సందర్శన చేసి ఇంటి పరిసరాల్లోని నీటి నిల్వలు తొలగించారు.నీటి నిల్వలున్న పెద్ద గుంతలో దోమల పెరగకుండా ఆయిల్ బాల్స్ వేసారు.
Spread the love