
స్థానిక వ్యవసాయ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్( జాతీయ సేవ పధకం) ఆధ్వర్యంలో “మేరీ మిట్టి -మేరీ దేశ్” కార్యక్రమంలో భాగంగా గురువారం ఉద్యాన తోటలో 75 సపోటా, కొబ్బరి, జీడీ మామిడి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలశాల ఇంచార్జి అసోసియేట్ డీన్ డా” ఐ. వి. శ్రీనివాస రెడ్డి మొక్కలు ప్రాణ వాయువు ఇవ్వడమే కాక ప్రశాంత వాతావరణాన్ని ఇచ్చి భూ తాపాన్ని తగ్గించడంలో తోడ్పడతాయని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ విద్యా శాస్త్రవేత్తలు గోపాల కృష్ణ మూర్తి, జంబమ్మ, నీలిమ, పావని, రెడ్ డి ప్రియా, సిబ్బంది రెహ్మాన్, జయమ్మ, శాంత్య నాయక్ ఇతర సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. జాతీయ సేవ పధకం అధికారి డాక్టర్ కడ సిద్ధప్ప ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరిచారు.