ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి..

25 ఏళ్లుగా సేవలందిస్తున్నాం..

– ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ శ్రావణ్ కుమార్
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ ఎం) కాంట్రాక్ట్. ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు  ఎన్ శ్రావణ్ కుమార్ అన్నారు. మంగళవారం కోఠి లోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ. మిషన్ డైరెక్టర్ ఎన్ హెచ్ ఎం కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్ హెచ్ ఎం లో పనిచేస్తున్న వివిధ కేడర్ల  కాంట్రాక్ట్‌ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 510 తో అన్యాయానికి గురైన ఉద్యోగులకు వెంటనే ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. ఎన్ హెచ్ ఎం లో గత 25 ఏళ్లుగా ప్రజలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ హెచ్ఆర్ పాలసీ. బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరికీ ట్రెజరీ ద్వారా జీతాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల రాత పరీక్ష రాసిన వారందరికీ పాస్ చేసి పర్మినెంట్ ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ‌ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ లఅందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ హెచ్ ఎం లో రాష్ట్రవ్యాప్తంగా 17 వేల మంది ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రతినిధులు ‌ ఎండి కరీం. బాలసుబ్రమణ్యం. రమణకర్. నరేష్. రమేష్ .శ్రీనివాస్. నవ కాంత్. సత్యవతి. అనిత. జయసుధ .వాణి .స్వప్న. శ్రీవాణి ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Spread the love